టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ మోసాలను నమ్మవద్దంటూ కాకినాడ ఎస్పీ జి.బిందు మాధవ్ హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: కాకినాడ
టెలిగ్రామ్‌లో పెట్టుబడులను రెట్టింపు చేస్తామంటూ వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సైబర్ మోసాల బారిన పడితే తక్షణమే బాధితులు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఆన్లైన్ ట్రేడింగ్ మరియు పెట్టుబడుల పేరుతో జరుగుతున్న నకిలీ ప్రలోభాలకు ఎవరూ బలికావద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.