భారతీయ మార్కెట్లోకి ఆర్క్ ఎక్స్ వన్ హ్యాండ్ హెల్డ్ గేమింగ్ డివైస్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: India

భారతీయ గేమింగ్ మార్కెట్లోకి స్వదేశీ కంపెనీ ఆర్క్ నూతనంగా ఆర్క్ ఎక్స్ వన్ హ్యాండ్ హెల్డ్ గేమింగ్ డివైస్ ను విడుదల చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ జి2 జెన్ 2 ప్రాసెసర్ తో పనిచేసే ఈ డివైస్ 7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆధారిత ఔల్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఎర్లీ వెయిట్ లిస్ట్ లో చేరిన వారికి రూ. 29,500 ధరకే లభించనుండగా, సాధారణ ప్రజలకు దీని ధర రూ. 33,500 గా నిర్ణయించారు.