ఖైరతాబాద్ ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటుతో తలెత్తిన ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో పట్టు సాధించేందుకు, బీఆర్ఎస్ బలమైన పునాదులను దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పోరును సవాల్‌గా తీసుకున్నారు. దానం నాగేందర్ మరోసారి పోటీ చేసి గెలిస్తే మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ ఈ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలులనుందని విశ్లేషకులు పేర్కొన్నారు.