యూసీఎల్ఏ లా స్కూల్ ప్రవేశాల్లో జాతి వివక్ష: అమెరికా న్యాయశాఖ వెల్లడి

రిపోర్టర్: శివ స్థలం: California

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లా స్కూల్ ప్రవేశాల్లో చట్టవిరుద్ధంగా జాతి ప్రాతిపదికను పరిగణించిందని అమెరికా న్యాయశాఖ గురువారం దర్యాప్తులో గుర్తించిందని అధికారులు వెల్లడించారు. నల్లజాతి, హిస్పానిక్ దరఖాస్తుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ శ్వేతజాతీయ, ఆసియా అమెరికన్ విద్యార్థుల పట్ల వివక్ష చూపినట్లు తేలిందని సివిల్ రైట్స్ డివిజన్ హెడ్ హర్మీత్ ధిల్లాన్ తెలిపారు. తాము నిబంధనలకు అనుగుణంగానే ప్రవేశాలు కల్పిస్తున్నామని, తమ ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉందని వర్సిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు.