ఐఐటీ మండి కొత్త డైరెక్టర్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: రమేష్ స్థలం: ఇండియా

ఐఐటీ మండి నూతన డైరెక్టర్ నియామక ప్రక్రియను కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. ప్రస్తుత డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా పదవీకాలం డిసెంబర్ 2026లో ముగియనుండటంతో, అర్హులైన విద్యావేత్తల నుంచి దరఖాస్తులను కోరింది. పీహెచ్‌డీతో పాటు ప్రొఫెసర్‌గా పదేళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐదేళ్ల కాలానికి లేదా 70 ఏళ్లు వచ్చే వరకు ఈ నియామకం కొనసాగుతుంది.