విజయవాడలో విజయసాయిరెడ్డి కీలక ప్రెస్ మీట్: రాజకీయాల్లో సంచలనం!

రిపోర్టర్: విజయ్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఈ నెల 7న విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ విఫలమైందని, ప్రజల సమస్యలపై గళం విప్పుతానని ఆయన ప్రకటించారు. ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తారా లేక రాజకీయ వ్యూహం మారుస్తారా అన్నది ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.