జర్నలిస్ట్ పాయల్ మెహతా మృతిపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: Amaravati
నెట్వర్క్ టెన్ సీనియర్ జర్నలిస్ట్ పాయల్ మెహతా ఆకస్మిక మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కేవలం కష్టపడి పనిచేసే జర్నలిస్టే కాక, నమ్మకమైన స్నేహితురాలని కొనియాడారు. తన తండ్రి అరెస్ట్ అయిన సమయంలో పాయల్ తనను సంప్రదించి ధైర్యం చెప్పిన క్షణాలను లోకేష్ గుర్తుచేసుకుంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.