'హైదరాబాద్ విమోచన దినోత్సవం': పరేడ్ గ్రౌండ్స్‌లో ఈటల రాజేందర్

రిపోర్టర్: రమేష్ స్థలం: Secunderabad, Telangana

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులతో కలిసి ఈ వేడుకల్లో పాలుపంచుకున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఈ ప్రత్యేక దినానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈటల రాజేందర్ వెల్లడించారు.