శంషాబాద్‌లో భారీ బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: రంగారెడ్డి
హైదరాబాద్‌ను హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో కీలక కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్‌గూడ వద్ద ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా అధికారులు 796.28 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. రైలు, విమాన, రోడ్డు రవాణా వ్యవస్థలను అనుసంధానిస్తూ ఈ వ్యూహాత్మక కేంద్రం రూపుదిద్దుకోనుంది.