టాలీవుడ్లో కొత్త చిత్రం: హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన ఓరి నాయనో

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఎస్. సాయి అభిషేక్ నిర్మాణంలో మణి తేజ గొంది దర్శకత్వంలో వస్తున్న ‘ఓరి నాయనో’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి తొలి క్లాప్ కొట్టగా, దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. కేవలం ఇరవై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు నిర్మాత సాయి అభిషేక్ వెల్లడించారు.