క్రిస్టానో రొనాల్డోపై మాంచెస్టర్ యునిటెడ్ మాజీ కోచ్ టెన్ హాగ్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: సతీష్
స్థలం: Manchester
క్రిస్టానో రొనాల్డో తన ఫిట్నెస్ ప్రమాణాలు అందుకోలేకపోవడం వల్ల మాంచెస్టర్ యునిటెడ్ జట్టును తీవ్రంగా నిరాశపరిచారని మాజీ కోచ్ ఎరిక్ టెన్ హాగ్ స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రొనాల్డో శిక్షణలో సరిగా పాల్గొనలేదని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా మైదానంలో పరుగులు పెట్టలేకపోయారని ఆరోపించారు. రొనాల్డో ప్రతిభపై తనకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, క్లబ్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని టెన్ హాగ్ వెల్లడించారు.