'కాపాడబోయి ప్రాణాలు వదిలారు..': గాలేరు-నగరి కాలువలో ముగ్గురు గల్లంతు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువలో ఐదేళ్ల చిన్నారి ఆరీఫ్ నీటి ప్రవాహాన్ని చూస్తుండగా కొట్టుకుపోయాడు. బాలుడిని కాపాడేందుకు దిగిన తండ్రి హఫీజ్, బంధువు ఆసిఫ్ కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోయి ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.