తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు: మహారాష్ట్ర సానుకూలతతో తెలంగాణకు భారీ ఊరట
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును నూట యాభై రెండు మీటర్లకు పెంచాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అత్యంత సానుకూలంగా స్పందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముంబైలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. మహారాష్ట్రకు ఎలాంటి నష్టం జరగకుండా, పరస్పర సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.