గణనాథుడి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసుల పిలుపు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

గణనాథుడి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే పండుగ మరింత సురక్షితంగా, విజయవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలంతా పోలీసులకు సహకరించి, పండుగను ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.