లిక్కర్ స్కామ్ తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Andhra Pradesh
లిక్కర్ స్కామ్ పేరుతో ఫామ్‌హౌస్‌లో డబ్బులు పెట్టి రాజ్ కసిరెడ్డిపై సిట్ అధికారులు తప్పుడు ప్రచారం చేశారని YSR Congress Party (YSRCP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ కసిరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో అసలు నిజాలు బయటపడ్డాయని పేర్కొంది. రాష్ట్రంలో ఉదయం ఎనిమిది గంటలకే మద్యం షాపులు తెరుస్తూ అర్ధరాత్రి వరకు నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. టీడీపీ నేతలు లేదా ఎల్లో మీడియా తన వెంట వస్తే మద్యం దుకాణాల అక్రమ నిర్వహణను స్వయంగా చూపిస్తానని సవాల్ విసిరారు.