శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ చిత్రం నుంచి ఎత్తర ఎత్తు సాంగ్ విడుదల
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ చిత్రం నుంచి ఎత్తర ఎత్తు గీతాన్ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భాస్కరభట్ల రాసిన ఈ విప్లవాత్మక గీతాన్ని విజయ్ బుల్గానిన్ స్వరపరచగా, నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.