ఉద్యాన పంటల రక్షణ కోసం కండలేరు ఎడమ కాలువకు నీటి విడుదల
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడేందుకు కండలేరు ఎడమ కాలువకు 110 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్‌బాబు తెలిపారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చొరవతో చేజర్ల, పొదలకూరు మండలాల్లోని నిమ్మ, మామిడి, జామ, ఆయిల్‌పామ్ పంటలకు వారం రోజుల పాటు నీరు అందనుందని పేర్కొన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించి రెండో తడికి నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.