ఏసీబీ ఉచ్చులో తహసీల్దార్: రూ.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత

రిపోర్టర్: కిరణ్ స్థలం: రంగారెడ్డి

అబ్దుల్లాపూర్మెట్ మండలంలో రూ.20 లక్షల భారీ లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారని అధికారులు తెలిపారు. లేఅవుట్ జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే రిపోర్టు కోసం బాధితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఈ దాడుల నేపథ్యంలో వారి నివాసాలలో సోదాలు కొనసాగుతున్నాయని, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.