నెల్లూరులో బియ్యం వ్యాపారుల అక్రమాలు బట్టబయలు: తూనికల శాఖ అధికారుల దాడులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా స్టోన్హౌస్పేటలో తూనికలు కొలతలు, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ రియాజ్ తెలిపారు. బహిరంగ మార్కెట్ లో కేజీ బియ్యం ధరను విపరీతంగా పెంచి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఇరవై ఐదు కేజీల బస్తాలో కేవలం ఇరవై నాలుగు కేజీలు మాత్రమే తూగుతున్నట్లు నిర్ధారించామన్నారు. ఈ మోసాలకు పాల్పడిన వ్యాపారులపై మూడు కేసులు నమోదు చేసి, నలభై ఐదు వేల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.