అమృత్‌సర్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ గుట్టురట్టు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Amritsar
అమృత్సర్ రూరల్ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్స్ మరియు ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు బోర్డర్ రేంజ్ ఐజీ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా జారువిడిచిన పది కిలోల హెరోయిన్ తో పాటు ఏకే-47, ఏకే-56 ఆటోమేటిక్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఘరిండా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.