నారాయణ కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ల అమానుష దాడి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: కర్నూలు
కర్నూలు నారాయణ కళాశాలలో జూనియర్ విద్యార్థి రవితేజపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఆసుపత్రికి వెళ్లి రవితేజను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విద్యార్థులకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.