స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై నిర్ణయం: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం ఉదయం పదకొండు గంటలకు అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.