ప్రయాణికులకు తీపి కబురు: విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం మరియు సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ రైళ్లలో మొత్తం పంతొమ్మిది కోచ్లు ఉంటాయని, పలు ప్రధాన స్టేషన్లలో హాల్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.