'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..': ఉత్తరాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించడంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రాబోయే కొన్ని గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.