ముదిగొండలో పంచాయతీ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముదిగొండ
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, సువర్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జిల్లా పంచాయతీ అధికారి వినోద్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డులు, పన్ను వసూళ్లు, నగదు పుస్తకాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల పనితీరు మరియు తాగునీటి సరఫరాపై ఆయన ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.