బీసీ కులగణన లెక్కల్లో మార్పులకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి తొలిసారిగా బీసీల జనాభా లెక్కలు తేల్చామని తెలిపారు. లెక్కల్లో ఎవరి వివరాలైనా నమోదు కాలేంటే సరిచేస్తామని, వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి గణనను మరింత పక్కాగా మారుస్తామని స్పష్టం చేశారు.