మహబూబ్నగర్ జిల్లాలో వైద్యశాఖ కొరడా: నిబంధనలు ఉల్లఘించిన మూడు క్లినిక్లు సీజ్

రిపోర్టర్: అశోక్ స్థలం: మహబూబ్‌నగర్

మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో అనధికారికంగా నిర్వహిస్తున్న మూడు ప్రైవేటు క్లినిక్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిబంధనలు ఉల్లఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వైద్యశాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.