తాండూరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు, భక్తుల సందడి

రిపోర్టర్: నరేష్ స్థలం: వికారాబాద్

తాండూరు అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కృష్ణుని డోలారోహణ కార్యక్రమంతో పాటు భజన సంకీర్తనలు నిర్వహించారు. శ్రీకృష్ణుని జీవిత గాథను స్మరిస్తూ, సత్యం, ధర్మం, న్యాయం మార్గంలో నడవాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించిపోయింది.