అరవింద్ కేజ్రీవాల్ కుటుంబానికి ఢిల్లీ ఎన్నికల సంఘం నోటీసులు
రిపోర్టర్: హరి
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబానికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం దేశ రాజధాని రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడంతో అన్-మ్యాపింగ్ కేటగిరీ కింద ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ రాజకీయ కుట్ర అని, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడానికే ఆప్ ఆరోపించింది.