కాంగ్రెస్ సంచులు, బీజేపీ చెప్పులు మోసే పార్టీలంటూ కేటీఆర్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ బౌన్సర్లు నెట్టివేయడం రాష్ట్రానికి అవమానకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ సంచులు మోసే పార్టీ అని, బీజేపీ చెప్పులు మోసే పార్టీ అని కేటీఆర్ మండిపడ్డారు.