ఉక్రెయిన్‌లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసిన ఆర్సెలర్‌మిట్టల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Kyiv
ఉక్రెయిన్‌లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ వెల్లడించింది. రష్యా జరిపిన భీకర దాడుల్లో ప్లాంట్ తీవ్రంగా దెబ్బతినడంతోపాటు ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, సురక్షితమైన కార్యకలాపాలు సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులను ఉధృతం చేయడంతో పారిశ్రామిక రంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది.