నిరుద్యోగులకు తీపి కబురు: ఏడాది పాటు ఉచితంగా డిజిటల్ కోర్సులు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఆర్సీ ఎగ్జామ్స్ మరియు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నలభై వేల రూపాయల విలువైన డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.