టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపు ఛార్జీలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
వినాయక చవితి మరియు వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం సాధారణ ఛార్జీలపై గరిష్ఠంగా 50 శాతం వరకు అదనపు వసూలు చేస్తున్నట్లు రవాణాశాఖ వెల్లడించింది. అయితే మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ యథావిధిగా వర్తిస్తుందని స్పష్టం చేసింది.