యూనివర్సిటీ విద్యార్థి మృతి కేసుకు సంబంధించి మాజీ లీడర్కు జైలు శిక్ష
రిపోర్టర్: సునీల్
స్థలం: Flagstaff
అమెరికాలోని నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనలో విద్యార్థి మృతి చెందడంతో, ఆ కాలేజీ ఫ్రటర్నిటీ మాజీ లీడర్ కార్టర్ ఎస్లిక్కు కోకోనినో కౌంటీ సుపీరియర్ కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పద్దెనిమిదేళ్ల విద్యార్థి కోలిన్ డేనియల్ మార్టినెజ్ విపరీతమైన మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్తో ప్రాణాలు కోల్పోయాడని పోస్ట్ మార్టం నివేదికలో స్పష్టమైందని విచారణాధికారులు వెల్లడించారు. ర్యాగింగ్ దారుణాలను అరికడతామని అధికారులు హెచ్చరించారు.