నెల్లూరులో పోలీసుల బందోబస్తు వేళ చైన్ స్నాచర్ల హల్ చల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు బిజీగా ఉన్న పోలీసులను ఆసరాగా చేసుకొని చైన్ స్నాచర్లు ఆదివారం రాత్రి ఘాతుకాలకు పాల్పడ్డారు. వేదాయపాలెం, చిన్నబజారు, దర్గామిట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలోని నాలుగు ప్రాంతాలలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని సుమారు యాభై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలను దుండగులు లాకెళ్లారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా పాత నేరస్థుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారుల వెల్లడించారు.