पश्चिम बंगालలో డీఆర్డీవో కొత్త క్షిపణి పరీక్షా కేంద్రం
రిపోర్టర్: హరి
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్లోని పూర్వ మేదినీపూర్ జిల్లా జున్పుట్లో మరో ప్రధాన ఆయుధ, క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఒడిశాలోని చాందీపూర్ కేంద్రానికి అనుబంధంగా డీఆర్డీఈ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ కీలక రక్షణ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని, ఇది రాష్ట్రానికి పెద్ద అభివృద్ధి కార్యక్రమమని ప్రతిపక్ష నేత సువేందు అధికారి వెల్లడించారు. బంగాళాఖాతం తీరంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రంతో రక్షణ రంగానికి మరింత బలం చేకూరనుంది.