గణేష్ నిమజ్జన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు

రిపోర్టర్: సునీల్ స్థలం: మెదక్

మెదక్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు, శోభాయాత్ర మార్గాలు మరియు సున్నితమైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు మెదక్ జిల్లా పోలీస్ వెల్లడించారు. ఈ తనిఖీల సందర్భంగా విద్యుత్ అడ్డంకుల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణ మరియు అదనపు బందోబస్తు ఏర్పాటుపై సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.