అఫ్గానిస్థాన్‌లోని పది కీలక స్థావరాలపై పాకిస్థాన్ సైన్యం భీకర వైమానిక దాడులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అఫ్గానిస్థాన్

అఫ్గానిస్థాన్‌లోని పది కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం గురువారం ఉదయం భీకర వైమానిక దాడులు నిర్వహించింది. అఫ్గాన్ భూభాగాన్ని ఆసరాగా చేసుకుని తెహ్రీక్-ఏ తాలిబన్ ఉగ్రవాదులు తమ దేశంలో దాడులు చేస్తున్నారని, ఇటీవల 27 మంది పోలీసులు మృతి చెందడానికి వారే కారణమని పాకిస్థాన్ సైనిక వర్గాలు ఆరోపించాయి. బుధవారం సరిహద్దు దాటేందుకు అఫ్గాన్ బలగాలు ప్రయత్నించడంతో పాటు డ్రోన్లను ప్రయోగించడంతో ఈ ప్రతీకార చర్య చేపట్టినట్లు స్పష్టం చేశాయి.