దసరా మండపాలకు ఉచిత విద్యుత్: నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ప్రకాశం
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అనుమతితో ఏర్పాటు చేసిన దసరా మండపాలకు గ్రామాల్లో మూడు కిలోవాట్లు, పట్టణాలలో ఐదు కిలోవాట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. పండగ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన స్పష్టం చేస్తూ ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు.