కేంద్రం నుంచి ఏపీకి సాస్కి కింద భారీగా నిధులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

ఈ ఆర్థిక సంవత్సరంలో సాస్కి కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.8,226 కోట్లు రానుండగా ఇప్పటికే రూ.3,486 కోట్లు విడుదలయ్యాయి. మూలధన వ్యయంతో పాటు వైద్య, గనుల రంగాల్లో సంస్కరణలు, మరణాల రేటు తగ్గింపు ప్రోత్సాహకాల ద్వారా ఏపీకి ఈ నిధులు దక్కుతున్నాయి.