ఢిల్లీలో ఉద్రిక్తత: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితాల సవరణకు వ్యతిరేకంగా సీజేపీ నిరసనల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఇండియా కూటమి సోమవారం భారీ ఆందోళనకు పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.