ఉత్తరప్రదేశ్‌లో ఏడు నెలల గర్భిణి హత్య, భర్త అరెస్ట్.

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడు నెలల గర్భిణీ అయిన 24 ఏళ్ల కిరణ్‌ను ఆమె భర్త విశాల్ కర్రతో కొట్టి హత్య చేశాడు. అడ్డుబోయిన అత్త ప్రేమను కూడా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.