డిగ్రీ విద్యార్థులకు ఆరు ఉద్యోగాధారిత నైపుణ్యాల శిక్షణ
రిపోర్టర్: సునీల్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులకు ప్రతి సెమిస్టర్లో ఒక ఉద్యోగాధారిత నైపుణ్యం నేర్పించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్న ఈ సరికొత్త కార్యక్రమంలో భాగంగా మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకునేలోపు విద్యార్థులు ఆరు అదనపు నైపుణ్యాలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రాక్టికల్ అభ్యాసానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.