పాలకులు మారినా ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్న ఎమ్మెల్సీ సత్యం

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో ప్రభుత్వాలు, నాయకులు మారినా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో లో-లెవెల్ బ్రిడ్జిలను హై-లెవెల్ బ్రిడ్జిలుగా మార్చాలని కోరుతూ చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.