చింతగూడెంలో ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాల వెల్లువ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెంలోని ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ తమవంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు.
స్థానిక దాత మిట్టపల్లి శంకర్ ఆలయ నిర్మాణానికి రూ.21,116 విరాళంగా అందజేశారు. దాతకు ఆలయ కమిటీ సభ్యులు రసీదు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనుల కోసం దాతలు సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.