టెలికాం వినియోగదారులకు శుభవార్త: రూ.147 నుంచి జియో కొత్త ప్లాన్లు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
మొబైల్ డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో రూ.147 ప్రారంభ ధరతో సరికొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ అధికారులు స్పష్టం చేశారు. ట్రాయ్ సూచనల మేరకు తెచ్చిన ఈ ప్లాన్లు ఫీచర్ ఫోన్ యూజర్లకు, రెండో సిమ్ వాడేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు తెలిపారు.