మరణించిన విద్యార్థి సాహిల్ తల్లిదండ్రులతో రాహుల్ గాంధీ భరోసా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ముంబై

లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరణించిన ఐఐటీ బొంబాయి విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడారు. వారికి అన్ని విధాలా సహాయం అందిస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాషిమ్ జిల్లా నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న తల్లిదండ్రులతో రాహుల్ గాంధీ దాదాపు పదిహేడు నిమిషాల పాటు మాట్లాడి ధైర్యం చెప్పారు.