రవాణాపల్లి పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని రవాణాపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిణి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి. కిత్తలోవ గ్రామానికి చెందిన కూడా రమణమ్మ చైర్మన్గా, కూడా కనకమహాలక్ష్మి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన పాలకవర్గం సభ్యులు తెలిపారు.