పాకిస్థాన్ క్రికెట్ దుస్థితిపై వసీమ్ అక్రమ్ తీవ్ర ఆవేదన.

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ 3-0 తేడాతో ఓడిపోతుందని సిరీస్‌కు ముందే తనకు తెలుసని మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ అన్నారు. జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పూర్తిగా దిగజారాయని మండిపడ్డారు. పీసీబీ ప్రక్షాళన చర్యలపై స్పందిస్తూ వ్యవస్థలోనే లోపాలున్నాయని విమర్శించారు. అలాగే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని డిమాండ్ చేశారు.