అమెరికా జైలులో కలకలం: గాయాలతో ఆస్పత్రికి రాపర్ డిడీ
రిపోర్టర్: రమేష్
స్థలం: New Jersey
అమెరికాలోని ఫోర్ట్ డిక్స్ ఫెడరల్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ రాపర్ సీన్ డిడీ కాంబ్స్కు వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తిందని అమెరికన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. తలకు గాయం కావడంతో శనివారం తెల్లవారుజామున ఆయన్ను జైలు నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన స్పృహతోనే మళ్లీ జైలుకు తిరిగి వచ్చినట్లు సమాచారం.